హుజురాబాద్: చేప పిల్లల పంపిణీలో ప్రభుత్వ నిర్లక్ష్యం: ఎమ్మెల్యే

64చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం జమ్మికుంటలో నిర్వహించిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నవంబర్ నాటికి 58 నుంచి 60 లక్షల చేప పిల్లలు పంపిణీ చేస్తే ప్రస్తుతం 26 లక్షల చేప పిల్లల్ని మాత్రమే ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. పంపిణీలో వ్యత్యాసాలను గణాంకాలతో వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్