నిధులను రప్పించే సత్తా నాకుంది : వినోద్ కుమార్

77చూసినవారు
నిధులను రప్పించే సత్తా నాకుంది : వినోద్ కుమార్
తను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటులో ప్రజల గొంతుక య్యానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. 106 సార్లు మాట్లాడినట్లు ఏకంగా 553 ప్రశ్నలడిగినట్లు స్పష్టం చేశారు. ఢిల్లీలో అప్పట్లో తను కలవని మంత్రి లేరని, అందరిని కలిసి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో అవసరమైన ప్రగతి కోసం తాపత్రయం చూపించానని పేర్కొన్నారు. నీటి ప్రాజెక్టుల అనుమతి సహా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రలో కలిపిన తీరుపై బలంగా గళమెత్తానన్నారు. హైకోర్టు విభజన విషయంలో తన వాదన వినిపించినట్లు, సిరిసిల్ల అపెరల్ పార్కు కోసం అలుపెరగని కృషి చేశారని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి సంసద్ గ్రామ యోజన కింద వీర్నపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, కొన్ని జాతీయ రహదారులు మంజూరు చేయించడంతోపాటు కీలక మైన వాటికోసం ప్రతిపాదనలు పెట్టారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటి పైనా తన దృష్టి ఉంటుందన్నారు. నిధులను ఎలా తీసుకు రావాలి? ఎవరిని ఎలా ఒప్పించాలనే విషయంలో స్పష్టమైన అవగాహన ఉన్నదన్నారు. న్యాయవాదిగా తనకున్న అనుభవంతో ఇక్కడి పరిస్థితులు, ఆవశ్యకతను వివరిస్తూ ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న పనులు శరవేగంగా జరిగేలా చూడటంతోపాటు కొత్త వాటిని సాధించడంలో ముందు వరుసలో నిలబడతానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపిస్తానని భవిష్యత్తులోనూ కీలకంగా తన పాత్రను పోషిస్తానన్నారు. కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా తన కృషి ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్