ప్రభుత్వం తప్పక సర్వీస్ రూల్ సమస్యను అతి త్వరలో పూర్తిచేసి మండల విద్యాధికారుల నియామకానికి చర్యలు చేపడుతుందని టిఆర్టిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్ లో జిల్లా అధ్యక్షులు తుంగూరి సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు.