పర్యావరణ పరిరక్షణ లో భాగముగా బుధవారం కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో నగర ప్రథమ పౌరుడు యాదగిరి సునీల్ రావు మరియు తెలంగాణ రాష్ట్ర సలహాదారులు మహిమల కేదార్ రెడ్డి ల చేతుల మీదుగా జిల్లా ఫోటో వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 100 మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సిరి రవి మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పూజించే విధంగా చేయాలని జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో 100 మట్టి గణపతులను పంపిణీ చేసాము అన్నారు.
ప్రజలు మట్టి విగ్రహాలను పూజించాలని కోరారు. మేయర్ సునీల్ రావు కి మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో శాలువా తో సన్మానం చేశామన్నారు. ఈ కార్యక్రమములో జిల్లా అధ్యక్షులు సిరి రవి, ప్రధాన కార్యదర్శి, తుమ్మ చందు, ఉపాధ్యక్షులు, ఫోకస్ శ్రీను, ఎమ్ బి స్టూడియో శంకరాచారి, ఉప్పల మధు, శ్రీనాథ్, వోల్లాల మధు, నిషాని శంకర్, లేఖ అనిల్, మిట్ట రాము, చంద్రగిరి వేణు, పట్టెం రాజు, బాలు, ప్రవీణ్, రాజేష్, రమేష్, ఇటిక్యాల రాజేందర్, టప్ప రవి, అనిల్, ప్రశాంత్, తదితర ఫొటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు.