తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కోర్టు భవన సముదాయంలో ఆదివారం జిల్లా జడ్జి బి ప్రతిమ జాతీయ పతాకావిష్కరణ గావించారు. బార్ అసోసియేషన్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేయగా అసోసియేషన్ పక్షాన స్వీట్ల పంపిణీ గావించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు పివి రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి ఇతర కార్యవర్గ సభ్యులు న్యామూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.