అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

858చూసినవారు
అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
కరీంనగర్ జ్యోతి నగర్ లోని శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నాలుగు రోజులుగా జరుగుతున్న తృతీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్వామివారి కల్యాణ మహోత్సవం ఘట్టం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. కళ్యాణ మహోత్సవానికి కమిటీ సభ్యులు అద్భుతమైన ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్