జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కాలేజ్ గ్రౌండ్ కి దగ్గరలో వెలసిన దుర్గ దేవి దేవాలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు పట్టణ ప్రజలు శ్రీ పాలెపు రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పూట గోపూజ, గణపతి పూజ, స్వస్తి పుణ్యహవచనం, నవగ్రహ పూజ, చండీ హవనం, అనంతరం దుర్గామాత కు పంచామృతంతో అభిషేకం ఒడి బియ్యం సమర్పణ నిర్వహించడం జరిగింది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారు. ఈ కార్యక్రమంలో 31 వ వార్డ్ కౌన్సిలర్ పెండెం గణేష్, మోటూరి ప్రవీణ్ కుమార్, అల్లాడి మహెష్, జలంధర్, శికారి రామకృష్ణ, శేఖర్, ఆలయ నిర్వహన కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.