వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బాడీ ఫ్రీజర్ ఏర్పాటు

1382చూసినవారు
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బాడీ ఫ్రీజర్ ఏర్పాటు
జగిత్యాల జిల్లా కోరుట్ల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బాడీ ఫ్రీజర్ ను ప్రజల సౌకర్యార్థం దాతల సహకారంతో ప్రభుత్వ హాస్పిటల్ లో ఏర్పాటు చేసినట్లు వాసవి క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టడం కోరుట్ల వాసవి క్లబ్ మాత్రమే చెందిందని అన్నారు. బాడీ ఫ్రీజర్ దాతలుగా జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొత్త సురేష్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్త సుధీర్, జిల్లా ఆర్యవైశ్య సంగం మాజీ కోశాధికారి రామ్ నారాయణ, రేగుండా అశోక్, బాశెట్టి కిషన్, రావికంటి పవన్ కుమార్ వ్యవహరించారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ కోరుట్ల అధ్యక్షులు కొత్త సునీల్, ప్రధాన కార్యదర్శి రేగొండ శిరీష, కోశాధికారి బాశెట్టి చైతన్య బాబు, ఉపాధ్యక్షులు మోటూరి ప్రవీణ్ కుమార్, ప్రతినిధులు ఎలిమిల్ల మనోజ్ కుమార్, కంటల విజయ్, మానుక రాజేంద్రప్రసాద్, క్లబ్ మాజీ అధ్యక్షులు అల్లాడి మహేష్, ముక్క చిన్నధర్మరాజు, వాసవి వనిత క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్