హైదరాబాద్ సచివాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డిని సోమవారం టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కూన గోవర్ధన్, వాకిటి సత్యం రెడ్డి, టీపీసీసీ ఫిషర్మన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు మారుతీ, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్న రెడ్డి తదితరులు ఉన్నారు.