కథలాపూర్ మండలం లోని సిరికొండ గ్రామంలో ఆదివారం రోజున బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి 98వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జగిత్యాల జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు గాంధారి శ్రీనివాస్ మాట్లాడుతూ వాజపేయి జనసంఘ్ కార్యకర్తగా, స్వయసేవకునిగా, ఉత్తమ పార్లమెంటేరియన్ గా, ప్రధానిగా దేశానికి, బీజేపీ కి చేసిన సేవలను కొనియాడారు. 1942లో భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకెళ్లారన్నారు. ఆనాడు నెహ్రూ పార్లమెంటులో వాజపేయి వాగ్ధాటిని చూసి ముగ్దుడై భావి భారత ప్రధాని అవుతాడని జోస్యం చెప్పారన్నారు. 1980లో అద్వానీతో కలిసి క్రమశిక్షణ గల సిద్ధాంతాలతో భారతీయ జనతా పార్టీని స్థాపించారన్నారు. ప్రధానిగా దేశీయ ఆర్థిక, రక్షణ రంగాల్లో మౌలిక సంస్కరణలు చేపట్టారని, అందుకే ఆయన జన్మదినం సందర్భంగా సుపరిపాలన దినోత్సవంగా జరుపుతున్నారన్నారు. వారిని స్పూర్తిగా తీసుకుని యువత, నాయకులు ముందుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో బద్రి సత్యం, ఒడ్డాటి శ్రీనివాస్, సిరిమల్లె రాజశేఖర్, అల్గోటు ప్రమోద్, సిరిమల్లె సత్యనారాయణ నీలి వినేశ్ తేజ, , ఏనుగు కిషన్ రెడ్డి, కాసోజి భాస్కర్, నీలి చరణ్, నీలి వరుణ్ తేజ, గుజ్జుల భూమయ్య, బూదగుండ్ల నాగభూషణం, ప్రభురాజ్ శ్రీకర్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.