రామడుగు: మాలల ఐక్యత అభివృద్ధి సమ్మేళనం విజయవంతం చేయండి

54చూసినవారు
రామడుగు: మాలల ఐక్యత అభివృద్ధి సమ్మేళనం విజయవంతం చేయండి
రామడుగు మండల కేంద్రంలో జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు కాడ శంకర్ ఆధ్వర్యంలో మాలల ఐక్యత అభివృద్ధి సమ్మేళనం కరపత్రాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. సమాజంలో మాలలకు జరుగుతున్న అన్యాయాలపై ఆర్థిక వెనుకబాటు తదితర అంశాలపై మాలలను ఏకతాటిపై తీసుకొచ్చేందుకు ఈనెల 3న కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేడి అంజయ్య, ఎలుక ఆంజనేయులు, మేడి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్