నిండు గర్భిణీ మృతి పై విచారణ చేపట్టాలి: ఎమ్మెల్యే

26223చూసినవారు
నిండు గర్భిణీ మృతి పై విచారణ చేపట్టాలి: ఎమ్మెల్యే
మంథని మాతా శిశు వైద్యశాలలో ప్రసూతి సేవల కోసం వచ్చిన మంథని మండలం స్వర్ణపల్లి గ్రామానికి చెందిన తొట్ల మాధవి మృతి పట్ల మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు విచారం వ్యక్తం చేశారు. మృతురాలి భర్త నైనవెని తిరుపతి వైద్యుల నిర్లక్ష్యం వల్ల తన భార్య ప్రాణాలు కోల్పోయారని తెలుపుతున్నందున దీనిపై ప్రత్యేక విచారణ చేసి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ ను కోరిన ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు కోరారు.

మంథని మండలం స్వర్ణపల్లి గ్రామానికి చెందిన తొట్ల మాధవి ( నైనవెని సంధ్యారాణి ) రెండవ కాన్పు కోసం మంథని ప్రభుత్వ మాత శిశు ఆస్పత్రిలో ప్రసూతి సేవలో కోసం బుధవారం ఉదయం వచ్చి అడ్మిట్ అయిందని పేర్కొన్నారు. కాగా ఆపరేషన్ నిమిత్తమై మాత శిశు ఆస్పత్రిలోని ప్రసూతి వైద్యులు, అనస్థీషియా డాక్టర్, ఇతర నర్సులు చికిత్స నిమిత్తం ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లి ముందు ఇంజక్షన్లు వేసిన తర్వాత పిట్స్ రాగానే వెంటనే అంబులెన్స్ ఇచ్చి పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి కి వైద్యులు పంపించడం వల్ల మార్గమధ్యములోనే తోట్ల మాధవి చనిపోయిందని అన్నారు. ఇది పూర్తిగా వైద్యుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని మండిపడ్డారు. మాధవి మృతి పై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తపరుస్తున్నందున దీనిపై వెంటనే పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని ఎఐసిసి కార్యదర్శి, మంథని శాసనసభ్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్