లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో పెద్దపల్లిలోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో మెడికల్ క్యాంప్ శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సుక్క శ్రీధర్, గంప రోహిత్, పాల్గొని హాస్టల్‌లోని 50మంది విద్యార్థులకు
పరీక్షలు నిర్వహించి రూ.8వేల విలువైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా భవిష్యత్‌లో ఏ అనారోగ్య సమస్యలు ఏర్పడిన ఫ్రీ కన్సల్టెషన్, ఉచితంగా మందులు ఇస్తూ వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.