విత్తన దుకాణాలలో అధికారుల తనిఖీలు

78చూసినవారు
విత్తన దుకాణాలలో అధికారుల తనిఖీలు
పెద్దపల్లి పట్టణంలోని విత్తన దుకాణాలను మంగళవారం జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, మండల వ్యవసాయ అధికారి అలివేణి తనిఖీ చేశారు. విత్తన డీలర్లు రైతులకు తప్పకుండా రసీదులు ఇవ్వాలని, స్టాక్ బోర్డులో వివరాలు, స్టాక్ రిజిస్టర్లను సరిగ్గా నిర్వహించాలని ఆదేశించారు. వానాకాలం సాగు రైతులకు విత్తనాలు సరిపడా అందుబాటులో ఉన్నాయని, రైతులు విత్తనాలు కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్