కళా సాగర్ కల్చరల్ ఆర్ట్స్ వ్యవస్థాపకుడు మధుర గాయకుడు, మాజీ సింగరేణి కళా కారుడు మద్దెల భాస్కర్ యొక్క సంతాప సభను గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం గోదావరిఖని మెయిన్ చౌరస్తా దగ్గరి సింగరేణి ఎస్సి, ఎస్టీ సంక్షేమ సంఘం స్పూర్తి భవన్ లో సంతాప సభను నిర్వహించినారు. కళా సమాఖ్య అధ్యక్షులు కనకం రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముందు గా భాస్కర్ చిత్రపటానికి పూలమాల వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రధ్ధాంజలి ఘటించారు.
సభలో పలువురు కళాకారులు భాస్కర్ యొక్క కళా నైపుణ్యాన్ని, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కనకం రమణయ్య మాట్లాడుతూ భాస్కర్ చిన్న తనం నుంచి పాటలు పాడుతూ జాతీయ స్థాయిలో ఎన్నో బహుమతులు పొందినాడని, సింగరేణి లో కోల్ ఇండియా కల్చరల్ పోటీలలో చాలా బహుమతులు సాధించినాడ న్నారు. కళా సాగర్ కల్చరల్ ఆర్ట్స్ ద్వారా తన మిత్రులు రాసకట్ల పోషం, చిలుముల శంకర్, శ్రావణ్, సంకె రాజేష్, జాఫర్, శ్యామ్, మొ. వారితో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు.
ఫ్లూట్ వాయిస్తూ ఆడ, మగ గొంతుతో పాటలు పాడిన భాస్కర్ 2018 లో కళాసాగర్ సంస్థ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారని వివిధ రంగాల్లో సేవలందించిన వారిని డా. బాబా సాహెబ్ అంబేద్కర్ స్మారక అవార్దులను ఆనాటి తెలంగాణ ఉద్యమ కారులు కోరుకంటి చందర్ చేతుల మీదుగా సత్కరించినాడని గుర్తు చేసుకున్నారు.
ఇంకా ఈ సభలో ప్రధాన కార్యదర్శి మాదరి శ్రీ నివాస్, ఆర్. రాజమౌళి, నాగుల శ్రీ నివాస్, గద్దల శషిభూషణ్, పోతుల చంద్ర పాల్, ధన్ సింగ్, ఎల్వీ రావ్, రాజబాబు, జగ్గయ్య, రామస్వామి, మొండి, పోచమల్లు, జె శ్రీ నివాస్, ఓంకార్, విజయ్, రాజశేఖర్, విజయ్ సంపత్ పాల్గొన్నారు.