గోదావరి కళా సంఘాల సమాఖ్య అధ్యక్షులు, జాతీయస్థాయి జానపద గాయకులు, కనకం రమణయ్య ను సిరిమువ్వ కల్చరల్ ఆర్ట్స్ గోదావరిఖని వారు జాతీయ స్థాయి ఉగాది పురస్కారం కు రమణయ్యను ఎంపిక చేసారు. గోదావరిఖని ఓపెన్ కాస్ట్ - 3 లో ఈపీ ఫిట్టర్ గా పనిచేస్తున్న రమణయ్య గత 35, సం. లు గా కళా రంగంలో సేవలందిస్తున్నారు.
ఈనెల 3వ తేదీ ఆదివారం నాడు స్థానిక శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించే భారతీయ సాంస్కృతిక ఉత్సవాలలో రమణయ్య కు రామగుండం శాసన సభ్యులు కోరుకంటీ చందర్ చేతుల మీదుగా జాతీయ స్థాయి కళా రత్న ఉగాది పురస్కారం ను రమణయ్య కు అందించనున్నారు. గోదావరి కళా సంఘాల సమాఖ్య సలహదారులు, కళాకారులు మేడ చక్రపాణి, బొంకూరి మధు, అభినయ రాజమౌళి, నిట్టూరి జీవన్ బాబు, కాసిపాక రాజమౌళి, చందా రాధాకిషన్ రావ్, సోగాల వెంకటి, మాదరి వాసు, లెల్లెల వెంకటేశ్వర రావు, బోడకుంట వెంకట్రాజం, జగ్గయ్య, నాగుల శ్రీ నివాస్, ధన్ సింగ్, రాజబాబు, పోలీసులు, అంజయ్య, శశి భూషణ్, అంజలి, సుమలత, నిట్టూరి రాజు, సిరిపురం శ్రీ నివాస్, రమణయ్య కు అభినందనలు తెలియజేసారు.