అంతర్గం సమస్యల పైన అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేత

1057చూసినవారు
అంతర్గం సమస్యల పైన అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేత
పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహిస్తున్న ప్రజావాణి లో యూత్ కాంగ్రెస్ అంతర్గాం మండల అధ్యక్షుడు ఒల్లేపు సాయికుమార్ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ దీపక్ కుమార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం సాయికుమార్ మాట్లాడుతూ అంతర్గాం మండల కేంద్రం లో సరైన వీధి దీపాలు లేక మండల కూడలిలో రాత్రి సమయంలో అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ఇప్పటికే మండల కూడలిలో యాక్సిడెంట్ అయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కొందరు చనిపోతున్నారని పలుమార్లు యాక్సిడెంట్లు అవుతున్నాయని మొరపెట్టుకున్న అధికారులు పట్టించుకోవడం లేదని కావున అధికారులపై చర్యలు తీసుకొని అంతర్గం మండల కేంద్రంలో పూర్తిస్థాయి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అంతర్గాం మండల అధ్యక్షుడు ఒల్లేపు సాయికుమార్, మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అలకుంట రాజేశం, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు దుబ్బల తరుణ్ కుమార్, మండల్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి వేముల సతీష్, అంతర్గం టౌన్ యూత్ అధ్యక్షుడు అలకుంట సంజు కార్తీక్ , సంతోష్, వంశీ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్