యువకుడిపై సీసాలతో దాడి

14880చూసినవారు
యువకుడిపై సీసాలతో దాడి
అంతర్గావ్ మండల కేంద్రంలో దేవేందర్ అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన సర్పంచ్ కొడుకు సోడా సీసాలతో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడి సంబంధించిన యువకులు హుటాహుటిన తీవ్ర రక్తస్రావం అవుతూ ఉండడంతో గోదావరిఖని లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిచారు. కాగా గాయపడిన యువకుడు, దాడి చేసిన యువకుడు గతంలో స్నేహితులు అని స్థానికులు తెలిపారు. కొన్ని రోజులుగా వీరి ఇద్దరికి మనస్పర్ధలు రావడంతో తనతో చనువుగా ఉండటం లేదని కక్ష పెంచుకుని శనివారం సాయంత్రం షాపుకు దేవేందర్ వెళ్లగా సందర్భం లేకుండా కల్పించుకొని మాటల దాడి చేసి చేతిలో ఉన్న సోడా సీసాతో దాడి చేసాడు అని బాధితుడు తెలిపాడు. దేవేందర్ తలకి పది కుట్లు వేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం దేవేందర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్