జిల్లాలో మహిళా సంఘాల పనితీరు మెరుగుపరిచేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో స్వశక్తి మహిళా సంఘాలపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమ యూనిట్లు లాభదాయకంగా నడిచేలా సహకారాలు అందజేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్, అడిషనల్ డిఆర్ డిఓ రవికుమార్ పాల్గొన్నారు.