మంథని: పొలం బాట పట్టిన విద్యుత్ అధికారులు
పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్ కమాన్ పూర్ సెక్షన్లో విద్యుత్ అధికారులు గురువారం పొలం బాట పట్టారు. ఈ సందర్భంగా ఏఈ అశోక్ రైతులను 24గంటల ఉచిత కరెంటు సక్రమంగా సరఫరా అయిందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పొలాల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లను, స్తంభాలను పరిశీలించి రైతులు విద్యుత్ మోటార్ల వద్ద ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ సిబ్బందికి తెలియకుండా రైతులు ఎలాంటి కరెంటు పనులు చేయకూడదని సూచించారు.