ప్రతి సి-సెక్షన్ ఆపరేషన్ కు ఆడిట్ ఫాం నమోదు చేయాలి: కలెక్టర్
జిల్లాలో జరిగే ప్రతి సి- సెక్షన్ ప్రసవానికి సంబంధించి ఆడిట్ ఫాం నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సి- సెక్షన్ ప్రసవాల నియంత్రణపై ప్రైవేట్ ఆస్పత్రుల గైనకాలజిస్ట్ డాక్టర్లతో సమీక్షించారు. అలాగే అనేమియా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా అనేమియా నివారణకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.