వేములవాడ పట్టణం బాగవంతరావు నగర్ చెందిన పండుగ సంతోష్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. సంబంధిత సమస్యపై వైద్యులను సంప్రదించారు. కిడ్నీ మార్పిడి చేయవలసిందిగా వైద్యులు తెలుపగా అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి తెలియజేయగానే తక్షణమే స్పందించి నిమ్స్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో మాట్లాడి రూ. 6లక్షల ఎల్వోసి ఇప్పించారు.