రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లి గ్రామ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పాఠశాల భవనం పాతవి అయినందున వర్షపు నీరు పాఠశాలలోకి రావడం, గోడలు అన్నీ నానిపోవడం, పాఠశాలకు సంబంధించిన ఫర్నిచర్ మొత్తం నీటిలో నానిపోవడం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా వర్షం వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి నెలకొం. దీనికి గాను స్కూల్ భవనాన్ని మరమ్మతు చేస్తేనే ఈ బాధలనుండి విముక్తి దొరుకుతుంది, ఇలా వర్షం నీటికి గోడలు నానడం వలన పిల్లలని స్కూల్ మొదలైన తరువాత తమ తల్లిదండ్రులు స్కూల్ కి పంపించడానికి భయాందోళనలకు గురవుతున్నారు. కావున మరమ్మత్తుకు రూ.60,000 వరకు డబ్బులు కావాల్సి ఉండగా దాతల వద్ద నుండి గ్రామ యువత ఆధ్వర్యంలో నగదును సేకరిస్తున్నారు. కావున ప్రజలు, ప్రతినిధులు, నాయకులు, యువకులు ప్రతి ఒక్కరూ ఒక మంచి పనికి ముందంజలో ఉండి తమకు తోచినంత నగదును పాఠశాలకు ఇవ్వగలరని కోరుతున్నారు.