కుటుంబ సమేతంగా గురువారం వేములవాడ రాజన్నను దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ (సర్వీసెస్) డి. కృష్ణ ప్రసాద్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. ప్రోటోకాల్ ఏఈఓ గజ్వేల్ రమేష్ బాబు లడ్డు ప్రసాదం అందజేశారు. వీరి వెంట పర్యవేక్షకులు రాజన్ బాబు, తిరుపతిరావులు ఉన్నారు.