వేములవాడ: రాజన్న సన్నిధిలో భక్తుల కోలాహలం

73చూసినవారు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం సెలవు దినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఆలయం రద్దీగా మారింది. స్వామివారికి కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. అందరిని చల్లగా చూడు రాజన్న స్వామి అంటూ భక్తజనం వేడుకున్నారు. ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్