వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీభీమేశ్వర సన్నిధానంలో (హనుమాన్) మంగళవారం రాత్రి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం భక్తజనం నిర్వహించారు. 67వ మంగళవారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగిందని హిందూ ఉత్సవ సమితి వేములవాడ వారు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తజనం వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.