ఆరుద్ర నక్షత్రం సందర్భంగా రాజన్న కోవెలలో విశేష పూజలు

55చూసినవారు
ఆరుద్ర నక్షత్రం సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో అర్చకులు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఉదయం మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో పాటు పరివార దేవతార్చన పూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా గావించారు. సంధ్యా సమయంలో కూడా ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేయనున్నట్లు వెల్లడించారు. స్వామివారి సేవలో తరించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్