రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు శనివారం వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల్లో కబడ్డీ పోటీలు ఉంటాయని కబడ్డీ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా వారు తెలిపారు. 30 టీమ్స్ పోటీల్లో ఉన్నాయని, ఇప్పటి వరకు 9 జట్లు పోటీలు పూర్తయ్యాయని కోచ్ లు చెప్పారు. అధిక సంఖ్యలో కబడ్డీ క్రీడోత్సవాలను చూసేందుకు క్రీడాకారులు, ప్రజలు రావడంతో సందడి వాతావరణం నెలకొందన్నారు.