Top 10 viral news 🔥
జీహెచ్ఎంసీ ఉద్యోగులకు దీపావళి కానుక
జీహెచ్ఎంసీ ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక అందించింది. రెండు రోజుల ముందే ఉద్యోగులకు జీతాలు విడుదల చేసింది. ఈ మేరకు ఉద్యోగుల జీతాల చెల్లింపునకు రూ.120 కోట్లు విడుదల చేసింది. గత పదేళ్ళలో తొలిసారిగా పండుగకి 2 రోజుల ముందే జీతాలు విడుదల చేయడం ఇదే తొలిసారి. దీంతో జీహెచ్ఎంసీ ఉద్యోగులు సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపారు.