ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిశీ ప్రమాణస్వీకారం (వీడియో)
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆప్ నేత ఆతిశీ ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ఆతిశీ ఆర్థిక, విద్య, పీడబ్ల్యూడీ, రెవెన్యూ సహా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆమెతో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో ఆప్ ఎమ్మెల్యేలు ఆతిశీని సీఎంగా ఎన్నుకున్నారు.