Top 10 viral news 🔥
ముగ్గు వేస్తున్న ఇద్దరు బాలికలపైకి దూసుకెళ్లిన కారు.. షాకింగ్ వీడియో
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో షాకింగ్ ఘటన జరిగింది. అదుపుతప్పి వేగంగా వచ్చిన కారు ఇద్దరు బాలికలను ఢీకొట్టింది. పండుగ సందర్భంగా ఇద్దరు బాలికలు ఇంటి బయట రంగోలీలు వేస్తున్నారు. అదే సమయంలో అటుగా అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి వారిద్దరినీ దారుణంగా ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ కారు దిగి పరారయ్యాడు. చివరికి పోలీసులు అతడిని పట్టుకోగా అతడు మైనర్ అని తేలింది. కాగా, బాలికలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.