కేరళ సీఎం పినరయి విజయన్‌కి తృటిలో పెను ప్రమాదం తప్పింది. తిరువనంతపురంలోని వామనపురంలో సీఎం కాన్వాయ్ వెళుతుండగా, ముందు వెళుతున్న ఒక స్కూటర్ డ్రైవర్ ఒక్కసారిగా కుడి వైపు తిరిగాడు. దీంతో వెనుకే వస్తున్న సీఎం కాన్వాయ్ ఒక్కసారిగా బ్రేక్ వెయ్యడంతో వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదు ఎస్కార్ట్ వాహనాలు ధ్వంసం కాగా.. సీఎం పినరయి విజయన్‌కు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.