ఖమ్మం జిల్లాలోని వరద బాధిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షోభ సమయంలో మంత్రులంతా ప్రజల వద్దే.. అందుబాటులో ఉండాలని సూచించారు. రాష్ట్రంలో వరదల కారణంగా ఇప్పటివరకు 16 మంది చనిపోయారని తెలిపారు. అలంతేకాదు.. ఈ వరదల వల్ల రూ.వేల కోట్ల ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు.