తెలంగాణ అసెంబ్లీలో మంగళవారం ఆరు ప్రభుత్వ బిల్లులు ప్రవేశ పెట్టనున్నారు. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ బిల్లుపై రేపు సభలో చర్చించనున్నారు. బిల్లుపై మంత్రి దామోదర రాజనర్సింహ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన కీలక ప్రకటన చేయనున్నారు. ఎస్సీ వర్గీకరణతో పాటు మరో ఐదు బిల్లులు ప్రవేశ పెట్టనున్నారు. ఈ క్రమంలో రేపు సభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు.