TG: SLBC టన్నెల్‌లో ప్రమాదం కారణంగా అక్కడ పని చేసే కూలీలు తమ సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. మేఘా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామని కొల్హాపూర్ వాసులు తెలిపారు. ‘ప్రమాద సమయంలో సొరంగంలోనే ఉన్నామని, టన్నెల్ మొత్తం నీటితో నిండిపోయింది. ఇప్పుడు తమ కంపెనీ సిబ్బంది ఒక్కరు కూడా లేరు’ అని చెప్పారు. ఇక్కడ చేసేది లేక స్వస్థలాలకు వెళ్తున్నామన్నారు.