బీజేపి విధానాలతో చిన్న పరిశ్రమలు చిన్నాభిన్నం: ప్రియాంక గాంధీ

55చూసినవారు
బీజేపి విధానాలతో చిన్న పరిశ్రమలు చిన్నాభిన్నం: ప్రియాంక గాంధీ
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ఉపాధి కల్పన ఊసే లేదని కాగ్రెస్ పార్టీ అగ్ర నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్ లోని కులులో మాట్లాడుతూ.. విపక్ష ఇండియా బ్లాక్ అధికారంలోకి రాగానే చిన్న, మధ్యతరహా వ్యాపారాలను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ఈ రంగంలోనే అత్యధిక ఉద్యోగాలు సమకూరుతాయని అన్నారు. కాషాయ పాలకుల విధానాలతో చిన్న పరిశ్రమలు చిన్నాభిన్నం అవుతుంటే.. బిలియనీర్లు మరింత సంపద పోగేసుకుంటున్నారని దుయ్యబట్టారు.

సంబంధిత పోస్ట్