హర్యానాలోని సోనిపట్‌లో మార్చి 9న ఓ షాకింగ్ సంఘటన జరిగింది. ఓ వితంతువు మహిళను వేగంగా వెళ్తున్న కారు బానెట్‌పై దాదాపు ఒక కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రిషబ్, సాత్విక్ అనే ఇద్దరు యువకుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సాత్విక్, అతని స్నేహితులు రిషబ్‌పై దాడి చేశారు. గొడవ ఆపడానికి వచ్చిన రిషబ్ తల్లిపై కూడా వారు దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.