ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడికి దిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్ ప్రతీకారం తీర్చుకుంది. 337 డ్రోన్లతో ఉక్రెయిన్ మెరుపు దాడులకు దిగింది. ఈ ఘటనలో రష్యాకు చెందిన ముగ్గురు మృతిచెందగా.. 18 మంది తీవ్రంగా గాయపడినట్లు రష్యా వర్గాలు వెల్లడించాయి. ఒకవైపు శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామంటూనే రష్యా, ఉక్రెయిన్ దేశాలు పరస్పరం మెరుపు దాడులు చేసుకుంటున్నాయి.