36 గంటలుగా తన వాట్సాప్ పనిచేయడం లేదంటూ సోనూసూద్ ఆవేదన

61చూసినవారు
36 గంటలుగా తన వాట్సాప్ పనిచేయడం లేదంటూ సోనూసూద్ ఆవేదన
తన వాట్సాప్ ఖాతా 36 గంటలుగా పనిచేయడం లేదంటూ నటుడు సోనూసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది కష్టాల్లో ఉన్నవారు వాట్సాప్ లో తనను కాంటాక్ట్ చేస్తారని, వారంతా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. సమస్యని వెంటనే చక్కదిద్దాలంటూ వాట్సాప్ ను ట్యాగ్ చేశారు. తన వాట్సాప్ అకౌంట్ తరచూ నిలిచిపోవడంపై ట్విటర్లోనూ ఆయన గతంలో ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్