ఈ నెల 15న మీన రాశిలోకి శుక్రుడు ప్రవేశించనున్నాడు. దీని వల్ల 'మాలవీయ మహాపురుష రాజయోగం' ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో దీనిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రాజయోగం 5 రాశులవారికి లాభం చేకూర్చనుంది. 5 రాశుల వారికి ఈ నెల 15 నుంచి గోల్డెన్ డేస్ వస్తాయని జ్యోతిష్యులు పేర్కొంటున్నారు.
మిథున రాశి: శుక్రుని రాశి మార్పు ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వీరు మంచి ఉద్యోగావకాశాలను పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు రానున్నాయి.
కన్య: కన్యారాశి వారికి మాళవ్య రాజయోగం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశుల వారికి భారీగా డబ్బు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు బలపడతాయి. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది. విదేశీ పర్యటనకు వెళ్లాలనుకునే వారికి బాగుంటుంది. పోటీ పరీక్షలు రాసే వారికి ఈ సమయంలో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ధనుస్సు: మాళవ్య రాజయోగం వల్ల ఈ రాశి వారు ఇల్లు లేదా కారును కొనుగోలు చేసే అవకాశం ఉంది. రాజకీయాల్లో చురుగ్గా ఉండే వారికి అనుకూలంగా ఉండనుంది. పెద్ద పదవులు వచ్చే అవకాశముంది.
కుంభ రాశి: ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. వీరి సంపద పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ రావొచ్చు. జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు పెండింగ్ బకాయిలు చేతికి అందుతాయి.