భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతోన్న మహిళల ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసింది. దక్షిణాఫ్రికా 72 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. లారా(20), అన్నకె(39), సునె(65), డెల్మి(0) పరుగులు చేశారు. క్రీజులో మారిజన్నె కప్(69), నాడినె(27) ఉన్నారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 3, దీప్తి ఒక వికెట్ తీశారు. అంతకుముందు భారత్ 603/6 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది.