వేసవిలో పండ్ల తోటల్లో ప్రత్యేక జాగ్రత్తలు

68చూసినవారు
వేసవిలో పండ్ల తోటల్లో ప్రత్యేక జాగ్రత్తలు
వేసవిలో పండ్ల తోటల్లో ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. నీటి వసతి అధికంగా ఉన్నప్రాంతాల్లో వడగాడ్పుల ప్రభావాన్ని తగ్గించడానికి మొక్కలకు తరచుగా నీరు ఇవ్వాలి. పండ్ల తోట 6 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సుదైతే ఒక రోజుకు ఒక చెట్టుకు 150–240 లీటర్ల నీరు అందించాలి. అవకాశం ఉన్నచోట సేంద్రియ పదార్థాలైన గడ్డి తదితర పదార్థాలతో మొక్కల మొదళ్లలో ఆచ్ఛాదన (మల్చింగ్‌) చేయటంతో పాటు బిందు సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్