తీగజాతి కూరగాయలను చాలా తేలికగా సాగు చేసుకోవచ్చు. వీటికి తక్కువ పెట్టుబడి పెట్టి అధిక లాభాలను ఆర్జించవచ్చు. తీగజాతి మొక్కలు ఎగబాకేందుకు వెదురు కర్రలతో పందిళ్లు వేసి వాటిపైకి ఎక్కేందుకు తాళ్లను కట్టాలి. పందిరి వేస్తే కాచిన కాయలు కిందకు వేలాడతాయి. దీంతో వీటిని తెంపడం చాలా సులభం అవుతుంది. అయితే ఈ తీగజాతి కూరగాయల పంటలకు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలు సరైనవి. అందువల్ల రైతులు దృష్టి సారించాలి.