HYD యూసఫ్‌గూడలోని బెటాలియన్‌లో కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీపీ జితేందర్ హాజరై మాట్లాడారు. అంతర్జాతీయ క్రీడాకారులు నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్ TGSPలో చేరారని, వారి సేవలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. బాక్సింగ్, క్రికెట్‌పై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.