పార్క్ హయత్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అగ్ని ప్రమాదం సమయంలో హోటల్లో సన్ రైజర్స్ ఆటగాళ్లు 6వ అంతస్తులో ఉన్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిని సురక్షితంగా బయటకు తరలించింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం హోటల్‌లో ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తోంది.