ఎస్ఎస్‌సీ కీలక ప్రకటన.. పరీక్షలు వాయిదా

77చూసినవారు
ఎస్ఎస్‌సీ కీలక ప్రకటన.. పరీక్షలు వాయిదా
దేశంలో ఎన్నికల నేపథ్యంలో ఈనెల 19 నుంచి జూన్ 1 వరకు జరగాల్సిన పలు పరీక్షలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాయిదా చేసింది. జూనియర్ ఇంజినీర్ పరీక్షలను జూన్ 5, 6, 7 తేదీల్లో, సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్-XII 2024 పరీక్షలను జూన్ 24, 25, 26 తేదీల్లో, ఢిల్లీ పోలీస్(ఎస్సై, సీఏపీఎఫ్) పరీక్షలను జూన్ 27, 28, 29 తేదీల్లో, సీహెచ్ఎస్ఎల్(10+2) పరీక్షలను జూలై 1, 2, 3, 4, 5, 8, 9, 10, 11, 12 తేదీల్లో నిర్వహిస్తామంది.

సంబంధిత పోస్ట్