షూటింగ్ లో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు గాయం!

584చూసినవారు
షూటింగ్ లో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు గాయం!
స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘సికందర్‌’. ఈ చిత్రాన్ని కోలీవుడ్‌ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో సల్మాన్ పక్కటెముకకు గాయమైంది. ఈ క్రమంలో ఓ ఈవెంట్‌కు హాజరైన ఆయన కాస్త అసౌకర్యంగా కనిపించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. దీంతో సల్మాన్‌కు ఏమైదంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు ప్రమాదమేమీ లేదని, షెడ్యూల్‌ ప్రకారమే సల్మాన్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారని మేకర్స్ తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్