ఎర్ర నేలలు ఎక్కువగా ఉండే రాష్ట్రాలివే!

60చూసినవారు
ఎర్ర నేలలు ఎక్కువగా ఉండే రాష్ట్రాలివే!
ఎర్ర నేలలు పురాతన స్ఫటికాకార రూపాంతర శిలలు శిథిలమవడం వల్ల ఏర్పడతాయి. అధికంగా ఇనుము, మెగ్నీషియం లాంటి లోహాలు ఉండటంతో ఎర్రగా ఏర్పడతాయి. భారత్‌లో 61 మిలియన్ హెక్టార్లలో(సుమారు 18.91%) విస్తరించి ఉన్నాయి. ఎక్కువగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఉన్నాయి. వరి, పత్తి, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, వేరుశనగ, కూరగాయలకు ఈ నేలలు అనుకూలంగా ఉంటాయి.

సంబంధిత పోస్ట్