స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది రిజ్వాన్ అలీని ఈ నెల 8న ఎన్ఐఏ, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసుల విచారణలో రిజ్వాన్ కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పేలుళ్లకు పాల్పడేందుకు కుట్ర పన్నాడని అధికారులు తెలిపారు. భారత్ లో శాంతి, మత సామరస్యానికి భంగం కలిగించడంతో పాటు, దాడులకు పాల్పడేందుకు ప్రణాళిక రచించారని అధికారులు పేర్కొన్నారు. ఐసిస్‌తో లింకు ఉన్న అతను పుణె మాడ్యూల్‌లో స్పెషలిస్టుగా ఉన్నాడు.