ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వెనక విద్యార్థి రాజకీయాల్లో ఉన్నవాళ్లే క్రియాశీలకమని CM రేవంత్ అన్నారు. విద్యార్థి దశలో సిద్ధాంతపరమైన భావజాలం తగ్గిపోవడం వల్లే పార్టీ ఫిరాయింపులు పెరిగాయని చెప్పారు. మనందరం విద్యార్థి రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. తెలంగాణలో విద్యార్థి రాజకీయాలు పునరుద్ధరించాలన్నారు. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మకత 'ఉనిక' పుస్తకాన్ని CM ఆవిష్కరించి మాట్లాడారు.